Tuesday, November 26, 2024

17 రంగులు, 15 డిజైన్‌లలో బతుకమ్మ చీరలు సిద్ధం

తెలంగాణలో బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్‌లలో తయారైన ఈ చీరలు అన్ని జిల్లాలకు చేరుకుంటున్నాయి. ఈసారి కూడా 18 ఏళ్ల వయసు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్‌ 6లోగా ఈ చీరల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో 1.05 కోట్ల మంది అర్హులైన మహిళలుండగా.. ఏటా దాదాపు 97 లక్షల మంది బతుకమ్మ చీరలు తీసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరలను తయారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై 75 లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్‌లో 12 లక్షల చీరెలు తయారు చేశారు. వీటిలో ఇప్పటికే 35 లక్షల చీరెలను 18 జిల్లాలకు తరలించి గోదాముల్లో భద్రపరిచారు. మిగిలిన జిల్లాలకు మరో 15 రోజుల్లో చీరలు చేరనున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement