Monday, September 16, 2024

Telangana – 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

నోటిపికేష‌న్ విడుద‌ల చేసిన గ‌వ‌ర్న‌ర్
24 నుంచి మండ‌లి సెష‌న్ ప్రారంభం
23న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం
ఆ త‌ర్వాత బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు నోటిఫికేషన్ గవర్నర్ రాధాకృష్ణ‌న్ విడుద‌ల చేశారు.తొలిరోజైన 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. 24 ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సెష‌న్ లోనే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది రేవంత్ స‌ర్కార్.. మొత్తంగా 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వ భావిస్తునట్లు స‌మాచారం .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement