తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై సభలో చర్చ జరుగనుంది. ఈ రోజు సభలో రెండు బిల్స్‌తో పాటు 6 పద్దులపై చర్చ చేపట్టనున్నారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం, హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ వెలుపల ఆవాసాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement