Saturday, November 23, 2024

ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు బీఏసీ స‌మావేశ‌మై అసెంబ్లీ ఎజెండాను ఖ‌రారు చేయ‌నున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను..  ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసనమండలిలో ప్రస్తుతం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ కోటాలో ఒకటి ఖాళీగా ఉంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు శాసనసభ సమావేశాల్లోపు అనుమతి లభిస్తే వెంటనే మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాల్లో ఐదు ముసాయిదా బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గృహనిర్మాణ సంస్థ చట్టం, ఉద్యానవన విశ్వవిద్యాలయం చట్టాలను సవరిస్తూ గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ల స్థానంలో బిల్లులు తీసుకురానున్నారు. పర్యాటకులపై దాడులను నియంత్రించేలా ప్రత్యేక చట్టం కోసం బిల్లు, రిజిస్ట్రేషన్ చట్ట సవరణ, పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement