Friday, November 22, 2024

మాజీలకు పింఛన్ పెంపు!

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఇవాళ పలు బిల్లులు ఆమోదం పొందాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు, ఉద్యోగ విరమణ వయోపరిమితి బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సభలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠ పింఛను రూ. 70 వేలకు పెంచారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ. లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ.. వైద్య ఖర్చుల పెంపు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉద్యోగ విమరణ వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.

సభ్యులందరికి పెన్షన్స్ పెంచాలని సీఎంను మాజీ ఎమ్మెల్యేలు కలిశారని సభలో మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇటీవలే జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే భాగన్న మరణించారని, హాస్పిటల్ లో 2లక్షల బిల్లు పెండింగ్ లో ఉంటే.. అదికూడా కట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు 30 వేల నుంచి 50 వేలకు పెన్షన్స్ పెంచినట్లు మంత్రి హరీష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement