మంత్రి జగదీష్‌రెడ్డి
- తెలంగాణలో కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు
- ఒకవేళ ఛార్జీలు పెంచాల్సి వస్తే తప్పక ప్రజలకు ముందుగా చెప్తాం
మంత్రి కేటీఆర్
- తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది
- ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నం చేస్తోంది
- 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్స్ ఉన్నాయి
- పర్యావరణ వ్యవస్థను పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్స్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది
- ఎలక్ట్రానిక్స్ ప్రోత్సాహకాల కోసం స్టీరింగ్ కమిటీ నియామకం చేసింది
- 70వేల కోట్ల పెట్టుబడుల టార్గెట్- 4లక్షల ఉద్యోగాల లక్ష్యంగా పెట్టుకున్నాం
- హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు కట్టుకోవడానికి పరిశీలిన ప్రభుత్వం చేస్తుంది
- గ్రామ కంఠం భూముల విషయంలో అధికారులతో మాట్లాడతాం
- టౌన్ ప్లానింగ్ విషయంలో 200 పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తున్నాం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్
- మా జిల్లాలో 8వేల రేషన్ కార్డ్ దరఖాస్తులు ఉన్నాయి
- 15వేల రేషన్ కార్డులను అధికారులు తొలగించారు
- మా జిల్లాకు తొలగించిన రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఇవ్వాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్
- గత ఏడాది ఓవర్సీస్ బడ్జెట్ ఈ సారి కూడా ఉపయోగించాలి
- నిధులు విడుదల చేయకపోవడంతో ఓవర్సీస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి
- మంచి పథకం కాబట్టి గ్రౌండ్ లెవల్‌లో సరిగ్గా అమలు చేయాలి
ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్
- Advertisement -
- ప్రతి ఏటా 5వందల మందికి స్కాలర్ షిప్ ఇవ్వాలి
- 2019-20లో 240 మందికి మాత్రమే ఇచ్చారు.
- 5వందల మంది నుంచి 240కి తగ్గించడానికి ప్రభుత్వం కారణం చెప్పలేదు
- ప్రభుత్వానికి దరఖాస్తులు రావడం లేదా? దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వం ఇవ్వడం లేదా?
- విదేశాలకు వెళ్లిన స్టూడెంట్స్ కి నిధులు పెండింగ్ ఉన్నాయి. 2017నుంచి పెండింగ్ పెట్టారు
- విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులు విడుదల చేయాలి.
మంత్రి కొప్పుల ఈశ్వర్
- విదేశీ విద్యకు వెళ్లే వారి ఆదాయం 10లక్షలకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది
- విదేశీ విద్యకు ముఖ్యమైన పది దేశాలు ఇప్పుడు ఉన్నాయి.. మరిన్ని చేర్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది
- ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా జరుపుతోంది
- గ్రామీణ ప్రాంతాల్లో నుంచే వెళ్లారు.. అమెరికా- ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఎక్కువగా వెళ్లారు
- కరోనా వల్ల గత ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది వాస్తవమే
- బీసీ విద్యార్థుల కంటే మైనార్టీ విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్ షిప్‌ను ఉపయోగించుకున్నారు.
మంత్రి గంగుల కమలాకర్
- రేషన్ కార్డుల విషయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టింది
- 53లక్షల 46వేలకు మాత్రమే మీరు అర్హులు అని చెప్పింది
- 1 కోటి 91లక్షల లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పింది
- ప్రస్తుతం రాష్ట్రంలో 1కోటి 79లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు
- 2 కోట్ల 79 లక్షల రేషన్ కార్డ్ ప్రస్తుతం ఉన్నాయి
- తెలంగాణలో ఉన్న జనాభాలో 80శాతం మందికి రేషన్ కార్డ్ ఉంది
- రేషన్ కార్డ్ నిరంతర ప్రక్రియ..కొనసాగుతూనే ఉంటుంది
- తెలంగాణ రాష్ట్రం వచ్చాక…2019లో 3లక్షల 59వేల కొత్త కార్డులు ఇచ్చాం
- మెదక్ జిల్లాలో 7వేలకు పైగా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చాం
- కరోనా వల్ల గత ఏడాది కార్డుల జారీ ఆలస్యం అయిపోయింది
- సిద్దిపేటలో 10వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. 7వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి.. అవి నిజమైన అర్హులకు ఇస్తాం
- గడిచిన మూడేళ్ళలో కొత్తగా 44వేల కార్డులు ఇచ్చాం
- 97వేల కొత్త కార్డులు పెండింగులో ఉన్నాయి
- కరోనా వల్ల కొత్త కార్డులు ఇవ్వలేక పోయాం.. పెండింగ్ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలన చేస్తుంది
- మూడు నెలలు వరుసగా బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డ్ తొలగిస్తారు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
- జూన్ 2014 నుంచి మెదక్‌లో ఎక్కడ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు
- కొత్తగా 3లక్షల 59వేల రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు
- 24వేల మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం సిద్దిపేటలో దరఖాస్తు చేసుకున్నారు
- బడ్జెట్ గణాంకాలు చూస్తుంటే అప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి
- మొత్తం దేశంలోనే కరోనా వ్యాక్సిన్ వెస్టేజ్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండటం బాధేస్తోంది
- తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌కు ఒక్క రూపాయి కేటాయించలేదు
- ఇరిగేషన్ కేటాయించే బడ్జెట్ లో ఒక రూపాయిలో 47 పైసలు ఒకే ప్రాజెక్టుకు వెళ్తున్నాయి
- దేశంతో పోల్చితే విద్యా రంగంలో తెలంగాణ వెనుకబడి పోయింది
- పోలీస్ శాఖకు దేశం సగటుతో పోల్చితే తెలంగాణ తక్కువగా 4 శాతం ఉంది
- కేటాయించిన అంకెలు గొప్పగా కనిపిస్తున్నాయి..అన్ని శాఖలకు అందేలా చుస్తే బాగుంటుంది
- మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ తీసుకుని.. చెడు జరిగితే కేంద్రంపై వేయడం కరెక్ట్ కాదు
- నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తగ్గించాలంటే నిరుద్యోగ భృతి ప్రకటించాలి.
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క
- భారీ బడ్జెట్ లో ప్రాధాన్యత రంగానికి అనుకున్నంత కేటాయింపులు లేవు
- విద్యా- వైద్య రంగానికి సర్కార్ మొండి చెయ్యి చూపించింది
- కరోనా వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికి తెలుసు
- వైద్యరంగానికి దేశ అవరేజ్ కంటే తక్కువగా కేటాయింపులు ఉన్నాయి
- రోడ్లు, బ్రిడ్జిలకు దేశ యావరేజ్‌తో పోల్చితే చాలా తక్కువగా కేటాయించారు
- వైద్య, విద్య, రూరల్ డెవలప్‌మెంట్, రోడ్లు, బ్రిడ్జిల శాఖలను ప్రభుత్వం తక్కువ చేసి చూస్తోంది
- ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం.. ఉద్యోగాల కల్పనలో ఇప్పటి వరకు దేశంలో ప్రియార్టీ రాష్ట్రంగా ఉండాల్సి ఉండేది.. కానీ లేదు
- కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతామని అంటుంది.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి
- ప్రభుత్వ రంగ సంస్థలు క్లోజ్ అయితే వేల సంఖ్యలో రోడ్డున పడతారు
- ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలి
- ప్రభుత్వం తెస్తున్న అప్పులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్
- నా నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంది
- మంచిర్యాల జిల్లా జన్నారంలో చెరువు కబ్జా అయింది
- సర్వే 400 ఉన్న చెరువు కబ్జా వల్ల రైతులకు అన్యాయం జరుగుతోంది
- జన్నారంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి
- జన్నారంలో డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి భూములు లేవు