తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. దేశంలో ఓ డి ఎఫ్ ప్లస్ లో మనమే నెంబర్ వన్ గా నిలిచామని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 4 తాజా సర్వేల్లో మరోసారి తెలంగాణ ప్రతిభ యావత్ దేశానికి తెలిసిందన్నారు. ఓ డి ఎఫ్ ప్లస్ గ్రామాలు, ఇండ్ల విభాగాల్లో 100 శాతం స్వచ్చత ఉన్నట్టు కేంద్రం గుర్తించిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వే లోనూ 100 శాతం స్వచ్ఛత ఉన్నట్టు చెప్పారు.
ఇక.. దేశంలో అత్యధిక టాయిలెట్స్ ఉన్న 5 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి హరీశ్‌రావు. కేవలం 9 ఏళ్ల లోపే ఈ మైలురాయిని దాటి, తెలంగాణ నెంబర్‌వన్‌గా రాష్ట్రంగా ఎదిగిందన్నారు. మరోసారి మన పల్లె సీమలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని సంతోషం వ్యక్తం చేశారు.
డబుల్ ఇంజన్ తో పని లేకుండానే డబుల్ ప్రతిభ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలో సగర్వంగా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు సంతోషంగా చెప్పారు. డబుల్ ఇంజన్ కు, డబుల్ పని చేస్తున్న సర్కార్లకు ఇదే తేడా నఇ ట్వీట్ లో వెల్లడించారు. సీఎం కేసీఆర్ దార్శనికత.. పల్లె ప్రగతి వంటి పథకాల ద్వారానే ఇది సాకారం అయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రానికి, సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ రావుకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.