Friday, November 22, 2024

Telangana – బాండ్ల వేలంతో రూ.1000 కోట్ల రుణ స‌మీక‌ర‌ణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకర ణకు ఆర్బీఐని ఆశ్రయించింది. రూ.1000 కోట్లు సమీ కరించు కునేందుకు నోటిఫికేషన్‌ కోరుతూ బాండ్లను జారీ చేసింది. 24ఏళ్ల కాలపరిమితితో ఈ బాండ్లను జారీ చేసింది. ఈ సోమ వారం బాండ్ల వేలం నిర్వహించను న్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.21 వేల కోట్ల రుణాలు రూపంలో సమకూర్చు కు న్నది. తాజాగా రూ.1000 కోట్ల బాండ్లను జారీ చేసింది. ఓపెన్‌ మార్కెట్‌ బారోయింగ్‌గా పిలిచే రుణ సేకరణపై కేంద్రం నియంత్రణలను విధించింది. దీంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఈ చర్య ప్రతికూలంగా మారింది. రాష్ట్ర రుణాలు నిర్దేశిత పరిమితిలోనే ఉన్నాయని పలుమార్లు ఆర్బీఐ వెల్లడించింది. 2014-15నుండి 2018-19వరకు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి సగటు అప్పు 16.1 శాతం లోపు ఉన్నది. ఇదే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అప్పు కావడం గమ నార్హం. ఈ ఏడాది అప్పులు, ఇతర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం రూ.52,167 కోట్లుగా అంచ నా వేసుకున్నది. మొదటి త్రైమాసికంలో రూ.15 వేల కోట్లు సమకూరలేదు. ఇందుకు కారణం కేంద్ర నియంత్రణలు కాగా, 2021-22లో జీఎస్‌ డీపీలో తెలంగాణ అప్పులు 26.9శాతంగా నమోదయ్యాయి.

ఏపీ 36శాతం, కర్ణా టక 26శాతం, హిమాచల్‌ ప్రదేవ్‌ 40శాతం, బీహార్‌ 32 శాతంగా అప్పులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అపూర్వ వృద్ధిని చూసిన ఆర్థిక సంస్థలు రుణాలిచ్చేందుకు క్యూ కడుతున్నాయి. తెలం గాణ బాండ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. గత త్రైమాసికంలో రాష్ట్రానికి రూ.1335 కోట్ల రుణాలిచ్చేందుకు 35 సంస్థలు బిడ్డిం గ్‌లో పాల్గొని తమ బిడ్లు దాఖలు చేశాయి. అయితే రాష్ట్ర ప్రభు త్వానికి ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి నేపథ్యంలో రూ. 750 కోట్ల రుణాన్నే సేకరించింది. ఇది కూడా కేవలం 8.52 శా తం వడ్డీ రేటుకే కావడం గమనార్హం. స్టేట్‌ డెవలప్‌ మెం ట్‌ లోన్స్‌ పేరిట ఆర్బీఐ నోడల్‌ ఏజెన్సీగా వ్యవ హరి స్తూ రుణాలను ఇప్పించడం ఆనవాయితీ. ఇందుకు ప్రతి 15 రోజులకోసారి బాండ్లను ఆర్బీ ఐ వేలం వేస్తుంది. ఈ వేలంలో నిధుల ఏజెన్సీ లైన వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూ చువల్‌ ఫండ్స్‌ సంస్థలు పాల్గొని బాండ్లను కొను గోలు చేస్తాయి. రాష్ట్రం లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి చేస్తున్న రుణ సమీకరణలో బడ్జెట్‌ వెలుపల నుంచి తెస్తున్న పూచీకత్తు రుణాలు విపరీ తంగా పెరిగిపోతున్నాయి. ఏ రాష్ట్రమైనా తన పన్నుల రాబడికంటే 10శాతానికి మించి రుణా లపై వడ్డీలకు చెల్లింపులు చేయరాదన్న ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో ఉంది. ఈ పరిమితికి లోబడిన రాష్ట్రమే స్థిర ఆర్థిక వృద్ధిరేటును కల్గి ఉన్నట్లుగా గుర్తిస్తారు. మొత్తం జీఎస్‌డీపీలో 3శాతానికి మించి అప్పులు చేయరాదన్న నిబంధనను రెవెన్యూ మిగులు అధి కంగా ఉన్న తెలంగాణకు 3.5 శాతంగా కేంద్రం అనుమ తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement