జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖతో పాటు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి(ఎంబసీ) మంగళవారం లేఖలు పంపింది. రాష్ట్రానికి చెందిన కడారి అఖిల్(25) కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు 2018లో జర్మనీ వెళ్లాడు. అయితే, మే 8న జరిగిన ప్రమాదంలో అఖిల్ ఉన్న పడవ నీళ్లలో మునిగింది. అప్పట్నించి అతని ఆచూకీ లేకుండా పోయింది. ఈ క్రమంలో అఖిల్ సోదరి ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవసరమైన చర్యలు తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement