Tuesday, November 12, 2024

చంచల్ గూడ జైల్ లో తీన్మార్ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష

జ్యోతిష్యుడిపై బెదిరింపు కేసులో అరెస్ట్ చంచల్ గూడ జైల్ లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జైలులోనే ఆయన దీక్షకు కూర్చున్నారు. అక్రమ కేసులకు నిరసనగా.. మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. బుధవారం బెయిల్ విడుదల అవుతారని భావించిన పోలీసులు.. జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు బనాయించినట్లుగా సమాచారం. పోలీసుల తీరుపై మల్లన్న అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణ పోలీసుల తీరుపై మేధావులు, వివిధ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కుట్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తీన్మార్ మల్లన్నపై కుట్రలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తి అయ్యేంత వరకు తీన్మార్ మల్లన్నను జైల్లో ఉంచాలనే కుట్ర పన్నుతున్నారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.

కాగా, జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శ‌ర్మ‌ను బెదిరించార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌తో తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు ఆగస్ట్ 27న రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో ఆయనను హాజరుపరచగా.. సెప్టెంబర్‌ 9వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. అదే సమయంలో మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ వేశారు.  

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో పెరిగిన బిర్యానీ ధరలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement