Tuesday, November 26, 2024

బిజెపి కండువా క‌ప్పుకోనున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌, ఉద్యోగ సంఘాల నేత విఠ‌ల్ .. ఎప్పుడంటే ..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బిజెపి అభ్య‌ర్థిగా నిలిచిన ఈట‌ల రాజేంద‌ర్ ఘ‌న విజ‌యం సాధించారు. దాంతో బిజెపిలో కొత్త ఉత్సాహం నెల‌కొంది. ఈ మేర‌కు తెలంగాణ‌లో బిజెపిని బ‌ల‌ప‌రిచేందుకు య‌త్నిస్తుంది. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లే గడువు ఉండటంతో ఆలోపే బలపడేందుకు బిజెపి ప్ర‌య‌త్నిస్తుంది. ఇతర పార్టీ నుంచి వల‌స‌ల ద్వారా వ‌చ్ప‌చే వారిని పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి నాయకులు పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీ నుంచి కీలక నాయకులను ఆకర్షిస్తున్నారు.

ఈనెలలో 9 లేదా 10 తేదీల్లో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉద్యోగ సంఘాల నేత విఠల్, తీన్మార్ మల్లన్నలు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల విఠల్ తో రాష్ట్ర బిజెపి నేతలు మంతనాలు సాగించారు. గతంలో తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం పెట్టిన కేసుల నేపథ్యంలో జైలు నుంచి విడుదల కావడానికి బిజెపి సహకరించింది. ఆ సమయంలోనే తీన్మార్ మల్లన్న బిజెపి లో చేరుతాన‌న్నారు. కాగా వీరిద్దరు ఢిల్లీలో బిజెపి పార్టీలో చేరుతున్నారని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరు పార్టీలో చేరనున్నారు. అది ఎప్పుడ‌న్న‌ది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement