విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య రావడంతో కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి విమానాన్ని అస్సాంలోని గువాహటి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కాగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..తాను.. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్, తెరస్ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరామని. దులియాజన్, టింగ్‌ఖాంగ్, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లోనే గువహాటి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేం సురక్షితంగా ఉన్నాం అని తెలిపారు. తాను ఇంకా విమానాశ్రయం లోనే ఉన్నానని, ఆ విమానం నడవదని అధికారులు చెప్పారని రామేశ్వర్ తెలి చెప్పారు. మరోవైపు దిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా దిగిందని గువాహాటి ఎయిర్‌పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 150 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. తనిఖీల కోసం విమానాన్ని పంపినట్లు చెప్పాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement