Wednesday, November 20, 2024

ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త్ ఘోర విఫ‌లం

ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ లో టీమిండియా అమ్మాయిలు ప‌రాజ‌యం పాల‌య్యారు. న్యూజిలాండ్ లో ఈ మ్యాచ్ జ‌రిగింది. హామిల్ట‌న్ లో ఆతిథ్య న్యూజిలాండ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 62 పరుగుల తేడాతో ఓడింది. హామిల్టన్ లో జరిగిన ఈ లీగ్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు చేయగా… లక్ష్యఛేదనలో భారత్ ఘోరంగా విఫలమైంది. 46.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. కెప్టెన్ మిథాలీ రాజ్ (31) స్టంపౌట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఓ దశలో భారత్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిథాలీ, హర్మన్ ప్రీత్ మెరుగైన భాగస్వామ్యంతో భారత్ కోలుకుంటుందన్న దశలో, అనవసరంగా ముందుకొచ్చిన మిథాలీ స్టంపౌట్ అయింది. న్యూజిలాండ్ బౌర్లలో అమేలియా కెర్ 3, లియా తహుహు 3 వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. టోర్నీలో టీమిండియా అమ్మాయిలు తమ తొలిమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించింది. ఇక టీమిండియా తన మూడో లీగ్ మ్యాచ్ ను ఈ నెల 12న వెస్టిండీస్ తో ఆడనుంది. వెస్టిండీస్ తో పోరు భారత్ కు సవాలు కానుంది. ఎందుకంటే వెస్టిండీస్ అమ్మాయిలు ఇప్పటివరకు తామాడిన రెండు మ్యాచ్ ల్లో నెగ్గి ఊపుమీదున్నారు.ఏమ‌వుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement