టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 327పరుగులకు ఆల్ ఔట్ అయింది. సెంచురియన్ టెస్ట్ లో రెండో రోజు ఆట వర్షం వల్ల రద్దయింది. మూడో రోజు ఆట ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. కాగా కేఎల్ రాహుల్ 123పరుగులు చేయగా, అజింక్యా రహానే 48పరుగులకు అవుటయ్యాడు. టీమిండియా లోయర్ ఆర్డర్ ఏమంత ప్రభావం చూపలేకపోయింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి 6 వికెట్లు పడగొట్టగా, రబాడా 3 వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ కు ఒక వికెట్ దక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టును బుమ్రా, షమీ దెబ్బతీశారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ (1)ను బుమ్రా అవుట్ చేయగా, కీగాన్ పీటర్సన్ (15)ను షమీ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 8 ఓవర్లలో 2 వికెట్లకు 30 పరుగులు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 297 పరుగులు వెనుకబడి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..