మంగళగిరి ప్రభ న్యూస్ : రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ పట్టణంలో ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్/ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ – 2021 పోటీల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసిన జిల్లా జట్టు పవర్ లిఫ్టర్లు తమ ప్రతిభను చాటారు. ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు వివరాలను వెల్లడించారు. పసుపులేటి వంశీకృష్ణ (సత్తెనపల్లి) సబ్ జూనియర్స్ 74 కేజీల విభాగంలో స్క్వాట్ 200 కేజీ, బెంచిప్రెస్ 130 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం, డెడ్ లిఫ్ట్ 243.5 కేజీ బరువెత్తి నేషనల్ రికార్డ్ గోల్డ్ మెడల్ సాధించి మొత్తం ఒరాల్ 573.5 కేజీ బరువెత్తి కాంస్య పతకం సాధించారు. జూనియర్స్ 66 కేజీ విభాగంలో ఎం.అశోక్ కుమార్ (పెదగార్లపాడు) స్క్వాట్ 250 కేజీ, బెంచిప్రెస్ 145 కేజీలెత్తి రజిత పతకం, డెడ్ లిఫ్ట్ 235 కేజీ, మొత్తం 620 కేజీబరువెత్తి ఓరాల్ కాంస్యపతకం సాధించాడు. మహిళల సబ్ జూనియర్స్ 84 కేజీ విభాగంలో షేక్ షబీనా(తెనాలి) స్క్వాట్ 130 కేజీలు,బెంచి ప్రెస్ 55 కేజీ, డెడ్ లిఫ్ట్ 122.5 కేజీ బరువెత్తి కాంస్య పతకం సాధించారు. విజేతలను కోచ్ లు ఎస్.కే. సంధానీ, పి. సురేష్ లు అభినందించినట్లు పుల్లేశ్వరరావు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..