Tuesday, November 26, 2024

Cricket: ఉత్కంఠ పోరులో టీమిండియా విజ‌యం.. అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం..

ఇంగ్లండ్‌తో జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా కుర్రాళ్లు అద‌ర‌గొట్టారు. 189 పరుగుల టార్గెన్‌ని సునాయ‌సంగా ఛేదించారు. ఈ క్ర‌మంలో నిశాంత్ త‌న అద్భ‌త‌మైన ప్ర‌దర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అయిదోసారి అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ సాధించి ఇండియా రికార్డు నెల‌కొల్పింది. అయితే.. ఫ‌స్ట్ ఓవ‌ర్‌లో రెండో బాలుకే వికెట్ ప‌డేసుకున్న ఇండియా చిన్నోళ్లు.. ఆ త‌ర్వాత ఆచితూచి ఆడారు. చివ‌ర‌కు 6 వికెట్ల‌ను జార విడుచుకున్నా.. టార్గెట్ ఛేద‌న‌లో వెన‌కంజ వేయ‌కుండా తెగువ చూపించారు. రవి బావా అటు అయిదు వికెట్లు తీయ‌డంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌రిచాడు. మిడిల్ ఆర్డ‌ర్‌లో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడి స్కోరుబోర్డును ముందుకు న‌డిపించాడు. త‌న‌తో పాటు నిశాంత్ ఫోర్లు, సిక్సులు బాదుతూ చివ‌రిదాకా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, బ్యాటింగ్​.. బౌలింగ్​లోనూ సత్తా చాటి రాజ్​ బావా మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ గా నిలిచాడు.

ఆరంభంలోనే అంగ్క్రిష్ రఘువంశీ (0) డ‌కౌట్ అయ్యాడు. అయితే షేక్ రషీద్, హర్నూర్ సింగ్ 49 పరుగుల భాగస్వామ్యంతో పరుగుల వేటను కొన‌సాగించారు. హర్నూర్ 21 పరుగుల వద్ద ఔట‌య్యాడు, రషీద్ వరుసగా రెండో అర్ధ సెంచరీని సాధించాడు కానీ, యాభై ప‌రుగులు చేసిన త‌ర్వాత ఓ బంతిని సిక్స‌ర్ కొట్ట‌బోయి క్యాచ్ అవుట‌య్యాడు. కెప్టెన్ యశ్ ధుల్ కూడా 17 పరుగులు చేసి ఔటయ్యాడు, దీంతో భారత్ 97/4తో కుప్పకూలింది. రాజ్ బావా & నిశాంత్ సింధు యాభై పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. రాజ్ 35 పరుగుల వద్ద ఔట‌య్యాడు. అయితే ఆంటిగ్వాలో జరిగిన ఈ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 189 పరుగులకు పరిమితం చేయడంలో రాజ్ ఎంతో మెరుగైన ఆట ఆడాడు. బౌల‌ర్ రవి కుమార్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టామ్ ప్రెస్‌తో సహా రెండు ప్రారంభ వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement