శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఏడు వికెట్ల తేడాతో లంకను చిత్తు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడారు. ఇంకా 80 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ ( 86 పరుగులు), ఇషాన్ కిషన్ (59 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. పృథ్వీషా ( 43 పరుగులు), మనీష్ పాండే 26 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 20న ఇదే స్టేడియంలో జరగనుంది.
ఇది కూడా చదవండి : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్ధు నియామకం..