లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఇంగ్లండ్‌పై 151 పరుగుల తేడాతో విరాట్ సేన విజయఢంకా మోగించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ కీలకమైన 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రూట్ సేనను భారత బౌలర్లు హడలెత్తించారు. దీంతో 120 పరుగులకే ఇంగ్లీష్ టీమ్ చేతులెత్తేసింది. సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్ 2 వికెట్లు తీయగా షమీ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో రూట్ (33)దే అత్యధిక స్కోరు అంటే మిగతా బ్యాట్స్‌మెన్ సంగతి అర్థం చేసుకోవచ్చు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేయగా ఇంగ్లండ్ 391 పరుగులు చేసింది. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఐదో రోజు లోయరార్డర్ పోరాటంతో 298/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మరోవైపు టీమిండియా సుమారు ఏడేళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement