సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు. ఇక.. బౌలింగ్‌లోనూ టీమిండియా కుర్రాళ్లు చాలా పూర్ అనిపించుకున్నారు. దీంతో సఫారీలు 227 పరుగుల అత్యధిక స్కోర్ చేశారు. అయితే.. దీటుగా ఆడాల్సిన బ్యాట్స్‌మన్ కూడా లైట్ తీస్కోవడంతో వెంట వెంటనే వికెట్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేస్తారనుకున్న క్రికెట్ అభిమానుల ఆశలపై టీమిండియా ప్లేయర్లు నీళ్లు చల్లారు. ఇక.. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా, శ్రేయస్ అయ్యర్ (1)పరుగుతో నిరాశపరిచారు. ఇక.. రిషబ్ పంత్ (27) కాసేపు దీటుగానే ఆడాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (46) మాంచి ఫామ్‌లో ఉన్నట్టు అనిపించి సిక్సులతో మోతెక్కిస్తుండగానే అవుటయ్యాడు. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లలో స్కై యాదవ్‌గా పేరు తెచ్చుకున్న సూర్య కుమార్ (8) కూడా ఇవ్వాల అంతగా ఆకట్టుకోలేదు. సిక్స్ బాదబోయి లాంగాఫ్‌లో ఫీల్డర్‌కి చిక్కాడు. దీంతో 87 పరుగులకే టీమిండియా కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత 12 ఓవర్లలోనే హర్షల్‌పటేల్ (17), అక్షర్ పటేల్ (9), రవిచంద్రన్ అశివన్ (2) పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో 120 పరుగుల వద్ద టీమిండియా 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినట్టయ్యింది. చివరాఖర్లో దీపక్ చాహర్ (31), ఉమేశ్ యాదవ్ (20), సిరాజ్ (5) కలిసి సఫారీ బౌలర్లను కాసేపు బాగానే ఆడుకున్నారు. దీంతో 49 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలయ్యింది. 2.1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది టీమిండియా.