Friday, November 22, 2024

ఈ ఏడాది నుంచే 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న – మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

మ‌న ఊరు – మ‌న బ‌డి పురోగ‌తిపై స‌మావేశంలో చ‌ర్చించామ‌న్నారు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైద‌రాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో మంత్రి కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్‌ విద్య, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చించారు.ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. . మొద‌టి ద‌శ‌లో 50 శాతం పాఠ‌శాల‌ల‌కు నిధులు మంజూరు చేస్తామ‌ని తెలిపారు. ఈ పాఠ‌శాల‌ల్లో జూన్ 12వ తేదీ నాటికి ప‌నులు పూర్తి చేయాల‌ని, ఆ బాధ్య‌త‌ల‌ను క‌లెక్ట‌ర్లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ ఏడాది నుంచే 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న చేప‌డుతామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement