Sunday, November 3, 2024

Shame | ములుగులో కీచక టీచర్‌.. ప‌దో త‌ర‌గ‌తి స్టూడెంట్‌పై లైంగిక దాడికి యత్నం

ములుగు జిల్లా కేంద్రంలో ఓ కీచ‌క టీచ‌ర్ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే విద్యార్థినుల‌పై క‌న్నేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న ఆల‌స్యంగా తెలిసింది. జిల్లా కేంద్రంలోని రంగారావుపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచ‌ర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నిన్న (మంగళవారం) విద్యార్థునులకు పాఠాలు చెబుతూనే ఓ స్టూడెంట్‌పై క‌న్నేశాడు..

ఆధార్‌ వెరిఫికేషన్‌ ఉందని చెప్పి ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ బాలిక‌ను గదిలోకి పిలిచాడు. టీచ‌ర్ మాటలు నమ్మిన ఆ విద్యార్థిని గదిలోకి వెళ్లిన తర్వాత లైంగిక దాడికి యత్నించిన‌ట్టు స‌మాచారం. అత‌డు చేసిన పనితో మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విష‌యాన్ని తెలియ‌జేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement