Wednesday, November 20, 2024

చంద్రబాబు పర్యటనలో జూ.ఎన్టీఆర్ జెండాలు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జూ.ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు హల్‌చల్ చేశారు. ఈ మేరకు జెండాల మీద తరువాతి సీఎం ఎన్టీఆర్ అన్న నినాదాలు రాసి ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తర్వాత ప్రజాదరణ ఉన్న నేత ఎవరు అంటే అందరూ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా జెండాల అంశం మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని పలువురు కార్యకర్తలు చంద్రబాబుకు సూచించిన సంగతి తెలిసిందే.

కాగా 2009లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వస్తున్న సమయంలో అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు.

ఈ వార్త కూడా చదవండి: 5 కోట్ల మంది జీవితాలను చంద్రబాబు తాకట్టు పెట్టాడన్న వైసీపీ ఎంపీ

Advertisement

తాజా వార్తలు

Advertisement