Friday, November 22, 2024

ఉత్త‌ర తెలంగాణ‌పై దృష్టి సారించిన తెదేపా…

బహిరంగ సభల అనంతరం చంద్రబాబు రోడ్‌ షోలు
సంక్రాంతి తర్వాత ఇంటింటికీ టీడీపీ బొట్టు
సెటిలర్స్‌తో టచ్‌ లో ఉన్న పార్టీ
నిజామాబాద్‌ బహిరంగ సభలో టీడీపీలో భారీగా చేరికలు
ఫిబ్రవరి 12, లేదా 13న బహిరంగ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పూర్వ వైభవాన్ని పునర్‌ ప్రతి ష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పక్కారాజకీయ ప్రణాళికలతో అడుగులు వేస్తుంది. అభివృద్ధి, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో తిరిగి అడ్డా వేసేం దుకు రాజకీయ వ్యూహ రచన చేసింది. ఖమ్మం బహిరంగ సభతో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం ఉనికి చాటుకున్నట్లే నిజామాబాద్‌ సభతో ఉత్తర తెలంగాణ లో టిడిపి స్థానాన్ని పదిల పర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే గతంలో ఉత్తర తెలంగాణలో ఉన్న టిడిపి కమిటీలు, నాయ కుల జాబీతాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరి శీలించి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కు సూచనలు చేశారు. ఈ సూచనల మేరకు గతంలో టిడిపి కి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు, నాయకులు, త్యాగాలకు సిద్ధంగా ఉన్న శ్రేణుల జాబీతాలను పరిశీలించారు. ఉత్తర తెలంగాణ లో పార్టీలు మారిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం.

అయితే పార్టీలు మారిన నాయకుల్లో పదవులు పొందిన వారు మినహా రెండవ శ్రేణీ నాయకులు తిరిగి టిడిపిలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్‌ బహిరంగ సభలో పలువురు ఉత్తర తెలంగాణ లోని వివిధ పార్టీల నాయకులు టిడిపిలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం లభించింది. ఫిబ్రవరీ 12,లేదా 13 వ తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయించింది. అయితే ఈ రెండుతేదీల్లో ఒకతేదీని టిడిపి అధినేత చంద్రబాబు ఖరారు చేయున్నట్లు కాసాని చెప్పారు. అయితే సంక్రాంతి అనంతరం టిడిపి తెలంగాణ నాయకులు నిజమాబాద్‌ లో క్షేత్ర స్థాయి పర్యటనలు, సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయనున్నారు. బహిరంగ సభలోగా నిజామాబాద్‌ లో ర్యాలీలు, పర్యటనలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయాలని టిడిపి రాష్ట్ర నాయకత్వం నిర్వహించి. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని టిడిపి యోచి స్తోంది. సంక్రాంతి అనంతరం మొదటి దశగా ఉత్తర తెలం గాణలో విస్తృత స్థాయి పర్యటలు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో రోడ్‌ షోలు
నిజామాబాద్‌ బహిరంగ సభ అనంతరం తెలంగాణలో రోడ్‌ షోలు నిర్వహించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నాయకత్వం కోరింది. అయితే చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే నిజమాబాద్‌, కరీంనగర్‌, వంరంగల్‌ బహిరంగ సభల అనంతరం రోడ్‌ షాలు నిర్వహించి ఎన్నికల తేదీల ప్రకటన వచ్చే సమయానికి హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో సింహగర్జన నిర్వహించాలని ఇప్పటికే టిడిపి అధిష్టానం నిర్ణయించింది.
బహిరంగ సభలు నిర్వహించే ముందు ఇంటింటికి టిడిపి, ఇంటింటికి బొట్టు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ చెప్పారు. అలాగే బహిరంగ సభల నిహణ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే నిజమాబాద్‌ టిడిపి నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌ బహిరంగ సభ అనంతరం తెలంగాణ పార్లమెంట్‌ నియోజక వర్గాల నాయకులను, జిల్లాపార్టీ అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులను నియమించనున్నట్లు తెలిపారు. సెటిలర్లు ఇప్పటికే టిడిపితో మంతనాలు జరుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో పూర్వవైభవాన్ని పునర్‌ ప్రతిష్టించే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో రాబోయే ఎన్నికలే నిర్ణయిస్తాయని పలువురు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement