Monday, November 18, 2024

సీఎం జగన్‌పై టీడీపీ నేతల విమర్శలు

ఏపీ సీఎం జగన్ 2019 ఎన్నికల్లో ఓ ప్రకటన చేశారు. తాను సీఎం అయితే రూపాయి మాత్రమే శాలరీ తీసుకుంటానన్నారు. కట్ చేస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.7,14,924ను మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన‌ ఉత్తర్వులపై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.2,91,096 కూడా కలిపి మొత్తం రూ.10,06,020 మంజూరు చేస్తూ గురువారం నాడు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్త‌ర్వుల‌ను టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్చ చౌద‌రి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ… ”రూపాయి ఆదాయానికి ‘ఏడు లచ్చలు’ ఇన్ కమ్ టాక్స్ కట్టడం రెడ్డి గారికే చెల్లింది. కేవ‌లం రూపాయి కదా ముఖ్యమంత్రి జ‌గ‌న్ గారు మీ జీతం! అంతే అయివుంటుంది లెండి” అని ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై ప్రతిపక్ష టీడీపీ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ప‌లు వివ‌రాల‌ను పోస్ట్ చేసింది. తాను సీఎం అయ్యాక ఒక్క రూపాయి మాత్ర‌మే జీతాన్ని తీసుకుంటాన‌ని గ‌తంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను అందులో టీడీపీ గుర్తు చేసింది. సీఎం ఆదాయప‌న్ను రూ.7.14 ల‌క్ష‌లు అంటూ దిన‌ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు పోస్ట్ చేస్తున్నారు. రూపాయి జీతానికి ఇన్ని లక్షల పన్నా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement