మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు పోలవరం యాత్రను చేపట్టారు. కాగా పోలవరం నిర్వాసితులను పరామర్శంచేందుకు వెళ్తున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చింతమనేనితో పాటు నిమ్మల రామానాయుడు, పితాని, గన్ని వీరాంజనేయులు తదితరులు నిర్బంధంలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..#