టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని చింతచెట్టు సెంటర్ వద్ద మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరుల దుకాణాలు తొలగించడం ఏంటని ఆయన అధికారులను ప్రశ్నించారు. బాధితులకు మద్దతుగా పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆయనను పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండిః పోలవరం పర్యటనకు సీఎం జగన్!