మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు టిడిపీ సీనియర్ నేత దేవినేని ఉమ. దీన్ని తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని ఉమ మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీసీ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందని విమర్శించారు. మీ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు జగన్ అంటూ ఉమ స్పష్టం చేశారు.ఇటీవల ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన వ్యవహారంలో ఏపీ సీఐడీ పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థ అధినేత నారాయణను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement