Friday, November 22, 2024

క‌ర్నాట‌క ఫ‌లితాల అనంత‌ర‌మే బిజెపి పొత్తుపై టిడిపి,జ‌న‌సేనల క్లారిటీ..

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మే మాసం ఎంతో ముఖ్యం కానున్నది. రాష్ట్రంలో రాజ కీయల సమీకరణాలు ఎలా మారబోతున్నాయనేదికి ఈ నెల తార్కారణంగా నిలవనుంది. శనివారం నాడు సమా వేశమైన టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనేది పైనే చర్చించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ వైసిపి విముక్త రాష్ట్రం కావాలని, అందుకు వ్యతిరేక ఓటు చీలకుం డా చూస్తానని ప్రక టించారు. ఆ దిశలోనే ఆయన చర్యలు ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటికే వివిధ సందర్బాల్లో 3 సార్లు చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ భేటి అయ్యా రు. టిడిపి,జనసేన కలిసి ముందుకు వెళ్తా యని ఇప్పటికే ఉన్న రాజకీయ వాతావర ణంలో కనిపిస్తోంది. ఈ పరిస్థితి నిబలప రుస్తూ శనివారం లోకేష్‌ పాద యాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొని సంఘీభా వం తెలిపారు. టిడిపి, జనసేన కలిసినప్ప టికీ వీరిద్దరికీ కేంద్రంలో బల మైన శక్తిగా ఉన్న బిజెపి కలిస్తే రాష్ట్రంలో తిరుగులేని కూటమిగా తయారవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచేందుకు కలిసి రావాలని బిజెపి కూడా పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేస్తు న్నారు. బిజెపిని తమ కూట మిలోకి తీసుకురావాలని భావిస్తున్న టిడిపి, జనసేన అందుకు కన్నడ ఎన్నికల ఫలితా లను డెడ్‌లైన్‌గా పెట్టుకున్నాయి.

కన్నడ ఫలితాలు ఎందుకంత ముఖ్యం..?
చంద్రబాబు, పవన్‌ల శనివారం భేటిలో బిజెపితో పొత్తుల చర్చలు జరపాలని , అందుకోసం కన్నడ ఎన్నికల
ఫలితాల తర్వాత మరోసారి సమావేశ మౌదామని నిర్ణ యించుకున్నట్లు తెలిసింది. కన్నడ ఎన్నికల ఫలితాల తర్వా త బిజెపితో కూడా చర్చలు జరపాలని భావించారు. అయితే వీరు కన్నడ ఎన్నికల ఫలితాలను ఎందుకు కీలకంగా భావి స్తున్నారనేది ప్రశ్న. కన్నడ నాట ఎన్నికల సరళిని గమనిస్తే బిజెపి పరి స్థితి అంత బాగా ఏమీ లేదు. కొన్ని సర్వేలు కర్నాటకలో హంగ్‌ వస్తుందని చెబుతుండగా మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తుందని తెలుపుతు న్నాయి. కాంగ్రెస్‌ కే పూర్తి మెజార్టీ వస్తే దక్షిణాదిలో బిజెపికి రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోఎక్కడా పట్టు దొరకని పరి స్థితి ఉంటుంది. అటు తెలంగాణలో బిజెపి రోజూ వార్తల్లో ఉం టున్నా ఇప్పటికున్న పరిస్థితి అయితే మళ్లి టిఆర్‌ఎస్‌నే అధికారంలో వచ్చే పరిస్థితి ఉందని సర్వేలు చెబుతున్నా యి. దీంతో కన్నడ ఫలితాలు అటు ఇటు అయితే ఆంధ్రప్రదేశ్‌లో తమకు మద్దుతిచ్చే ఎంపిల సంఖ్య ఉండడం బిజెపికి అవసరం. ఈ పరిస్థితి దృష్ట్యా కన్నడ ఫలితా లను బట్టి బిజెపితో చర్చలకు వెళితే టిడిపి,జనసేనకు అనుకూ లంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుందని రాజకీ య విశ్లేషకు లు అంటున్నారు. వీటన్నింటి పరిణామాల రీత్యామేమాసం ఏపీ రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో కీలక మాసంగా నిలవనుంది.

బీజేపీని ఒప్పించే దిశగా చర్యలు
తమ కూటమిలోకి బిజెపిని కూడా తీసుకురావాలని జనసేన,టిడిపి భావిస్తున్నాయి. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసి వైసిపి విముక్త రాష్ట్రం సాధించేందుకు టిడిపితో కలిసి జట్టు కడతాదామనే ప్రతిపాదన వారి ముందు ఉంచారు. కాగా అటు బిజెపి రాష్ట్ర నాయక త్వం గానీ, కేంద్ర నాయకత్వం గానీ చంద్రబాబుపైన అంత సాను కూలంగా లేరు. చంద్రబాబుతో సంబంధం లేకుండా మనిద్దరం కలిసి పోటీ చేద్దామని జనసేనకు బిజెపి ప్రతిపాదిస్తోంది. దీనివల్ల వైసిపికే లాభం జరుగతుందని జనసేన భావిస్తోంది. ఈ తరుణం లో రిప బ్లికన్‌ టీవీ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడిన
చం ద్రబాబు ప్రధాని మోడీ విధానాలను అకాశానికెత్తేశారు. మోడీ విజన్‌ 2047కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎన్డీయేలో తిరిగి చేరతారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానమి స్తుందన్న ఆయన ఆ విషయాన్ని తోసిపుచ్చలేదు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వైసిపిని ఎదుర్కొనడానికి బిజెపి అవసరం కూడా ఉందని అటు టిడిపి, ఇటు జనసేన భావిస్తున్నాయి. అది రాష్ట్రంలో బిజెపికున్న ఓటింగ్‌ రీత్యా కాకుండా కేంద్రంలో బల మైన శక్తిగా ఉన్నందున, తమ విజయానికి ఎటువంటి ఆటంకం ఏర్పచకుండా ఉండేందుకు బిజెపితో కలిసి వెళ్లాలనే ఆలోచనలో టిడిపిఉన్నట్లుతెలుస్తోంది.దీంతోతమ కూటమిలోబిజెపి కూడా ఉండేలా ఒప్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement