భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసిషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తామన్నారు. క్లీన్ చిట్ లేని వ్యక్తి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఎ)ను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రంజీ క్రికెట్ ఎంపికలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అజరుద్దీన్ కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తెచ్చుకున్నారని చెప్పారు. తనపై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాల నుంచి అజర్ తప్పించుకోలేరన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేస్‌లో బీసీసీఐ నుంచి అజర్‌కి క్లీన్ చిట్ లభించలేదని యెండల లక్ష్మినారాయణ చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement