ప్రముఖ DTH కంపెనీ టాటా స్కై (Tata Sky) పేరు మారింది. టాటా స్కై పేరును టాటా ప్లే (Tata Play)గా మారింది. టాటా స్కై వినియోగిస్తున్న వారు కొత్త సర్వీసులకు మారనున్నారు. నేటి (జనవరి 27) నుంచి టాటా స్కై కొత్త పేరు కనిపించనుంది. టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ సర్వీసులను విస్తృతంగా అందించనుంది. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తోనూ చేతులు కలిపింది.
ఓటీటీ కాంబో ప్యాక్‌లను తీసుకుంటే.. టాటా ప్లే కస్టమర్లు బింగే సర్వీసుల్లో భాగంగా సాధారణ టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. టాటా ప్లే బింగే మొత్తంగా 13 ప్రధాన ఓటీటీ యాప్స్‌కు సపోర్టు చేస్తుంది. అలాగే ఒకేసారి పేమెంట్స్, సబ్ స్క్రిప్షన్ పొందేలా ఇంటర్ఫేస్‌ను ఇస్తోంది టాటా ప్లే. నెట్ ఫ్లి్క్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టాటా ప్లే జాబితాలో ఉండనున్నాయి.