టాంజానియా దేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపట్టారు. సమియా సులుహు హాసన్ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. దార్ ఈ-సలాంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
హిజాబ్ ధరించి..కుడిచేతిలో ఖురాన్‌ను పట్టుకుని తూర్పు ఆఫ్రికా దేశాల చీఫ్ జస్టిస్ సమక్షంలో దేశ రాజ్యాంగంపై సులుహు హాసన్ ప్రమాణం చేశారు. అనంతరం మిలిటరీ పరేడ్‌ను పరిశీలించారు. టాంజానియా మాజీ అధ్యక్షులు అలీ హసన్ మ్విని, జకాయ కిక్వేటే, అబీద్ కరుమె కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా నిబంధనల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో టాంజానియా రాజ్యాంగం ప్రకారం… తదుపరి దేశాధ్యక్షునిగా హాసన్ బాధ్యతలు చేపట్టారు.
టాంజానియా తొలి అధ్యక్షురాలిగా సులుహు
Advertisement
తాజా వార్తలు
Advertisement