అందని ద్రాక్షగా మారింది టమాట..ప్రతి కూరలో టమాట వేసి తీరాల్సిందే..అప్పుడే టేస్ట్ అనుకునేవారికి ఇది చేదువార్త..ఇది కార్తీకమాసం సాధారణంగానే కూరగాయల రేట్లు అధికంగానే ఉంటాయి. అయితే అన్ని కూరగాయల ధరలు ఒక ఎత్తు అయితే టమాటా ధరలు మాత్రం ఆకాశానంటుతున్నాయి. పెట్రోల్ ధరలనే మించిపోయాయి. ఏపీలో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలికింది.నేటి ఉదయం నుంచి సగటున కిలో టమాట రూ.104కు అమ్ముడవుతోంది. పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని వ్యాపారులు తెలిపారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు ఏర్పడడం వంటి కారణాలతో టమాటల రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement