కరోనా వైరస్ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా మహమ్మారి వల్ల తల్లితండ్రులు మరణించగా పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎందరో అనాథలుగా మారుతున్నారు. అలాంటి వారి కోసం తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందివ్వబోతున్నట్లు ప్రకటించారు. తల్లి లేదా తండ్రి ఒక్కరే మరణిస్తే రూ.3లక్షలు ఇచ్చి ఆదుకుంటామని, ఆ పిల్లలు డిగ్రి చదివే వరకు ఆ ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ తల్లితండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణ తీసుకోవటంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. కానీ దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇలాంటి పిల్లలు తెలంగాణలోనూ ఉన్నారు. వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కూడా స్పందించాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.