ఆయన స్టైల్ , ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన రియల్ క్యారెక్టర్, ఆయన యాటిట్యూడ్ వీటన్నింటికీ మించి సింప్లిసిటీ ఆయన సొంత. స్టార్ హీరోగా ఎదిగినా ఆయన ఒదిగే తీరు అసమాననీయం.. అందుకే ఆయనకి ప్రపంచం అంతటా అభిమానులు వున్నారు. ఆయనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. నేడు ఆయన పుట్టినరోజు. ఆయన జన్మస్థలం మహారాష్ట్ర.. అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. సినిమాలోకి అడుగుపెట్టాక రజనీకాంత్ గా మారిపోయారు. 1950, డిసెంబర్ 12న పుట్టారాయన. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ బస్ కండక్టర్ అనే సంగతి అందరికీ తెలిసినదే. అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళ సూపర్ స్టార్ గా మారారు. రజనీకాంత్ మాతృభాష మరాఠీ..ఆయన పెరిగింది కర్ణాటక రాజధాని బెంగళూరులో.
కాగా రీసెంట్ గా రజనీకాంత్ అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. 1975 లో గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తొలిసారి తమిళ సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నరజనీకాంత్ రీసెంట్‌గా తన 71వ బర్త్ డే జరుపుకుంటున్నారు. రీసెంట్ గా అన్నాతై, తెలుగులో పెద్దన్నయ్య చిత్రంతో ప్రేక్షకులని అలరించారు. కాగా రజనీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ఇంటి ముందు అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి.