సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. వివిధ భాషల్లో ఆయన దాదాపు 800 పాటలు ఆలపించారు. దాదాపు దక్షిణాది అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా పాటలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, జానపద గీతాలను కూడా ఆలపించారు.
తమిళ చిత్రం దిల్ తో వినాయగం సింగర్ గా తొలి పాట పాడారు. ధనుష్ నటించిన ‘తిరుడా తిరుడి’ చిత్రంతో తమిళనాట నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ పాటతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు, తెలుగు మంచు మనోజ్ తొలి సినిమా దొంగ-దొంగది చిత్రంలో హీరోకు తండ్రి కూడా నటించి మంచి గుర్తు తెచ్చుకున్నారు. మాణిక్య వినాయగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..