భారత విద్యార్థి ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. అతడు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నాడని.. అయితే అవి తిరస్కరణకు గురయ్యాయని ఆ విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ (Sainikesh Ravichandran) స్వస్థలం తమిళనాడులోకి కొయంబత్తూరు జిల్లా. అతడు 2018లో ఉక్రెయిన్ ఖర్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సు చదువుకోవడానికి అక్కడికి వెళ్లాడు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. 2022 జూలై 2022 నాటికి అతడి కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే భారతీయుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పెద్ద సంఖ్యలో భారతీయులను స్వదేశానికి చేర్చింది
ఇదిలా ఉంటే..ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సాయినికేష్‌తో అతని కుటుంబ సభ్యులు కమ్యూనికేషన్ కోల్పోయారు. దీంతో వారు భారత రాయబార కార్యాలయం సహాం కోరారు. దీంతో రాయబార కార్యాలయం అధికారులు.. సాయినికేష్‌ను సంప్రదించగలిగారు. అయితే సాయినికేష్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ దళాలలో చేరినట్టుగా తెలియజేశారు.సాయినికేష్ వాలంటీర్లతో కూడిన Georgian National Legion paramilitary unitలో చేరి రష్యాపై పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే స్థానికల అధికారులు కొయంబత్తూరు జిల్లాలోని సాయినికేష్ ఇంటకి వెళ్లారు. సాయినికేష్ గురించిన వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.