దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా టమాటా ధరలు పలుకుతుండడంతో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాకా పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయనుకుంటే… ఇప్పుడే వాటిని మించి టమోటా ధర కిలో రూ.130లకు పైనే ఉంది. సామాన్య ప్రజలు టమోటాను కొనాలంటే భయపడుతున్నారు… టమాటానా… కొనగలమా… అంటూ.. చింతపండు వైపు చూస్తున్నాయి… అయితే ఇలాంటి తరుణంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సీఎం స్టాలిన్ కిలో టమాటా రూ.70 లకే ప్రజలకు ఇవ్వాలని అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.150 లు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో సబ్సిడీలో టమాటాలు పంపిణీ చేయాలని ఆదేశాలు సీఎం స్టాలిన్ జారీ చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..