తమిళనాడు సీఎం స్టాలిన్ రూటే సపరేటు..ప్రజా సమస్యలపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. కాగా రోడ్డు పక్కన సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ అనే ప్లకార్డుతో నిల్చున్నాడు ఓ యువకుడు. దాంతో ఆ యువకుడిని చూసిన స్టాలిన తన కాన్వాయ్ ని ఆపి యువకుడితో మాట్లాడారు. స్టాలిన్ తన నివాసం నుండి అసెంబ్లీకి వెళ్లే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్టాలిన్, వాహనం దిగి స్వయంగా ఆ యువకుడితో మాట్లాడారు. ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నారు.
కాగా, ఆ యువకుడి పేరు ఎన్. సతీశ్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు. ఇటీవల కొంతకాలంగా నీట్ విషయంలో సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న పోరాటానికి సతీశ్ కూడా ప్రభావితుడయ్యాడు. స్టాలిన్ ను ఈ విషయంలో అభినందించిన సతీశ్… దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులకు మినహాయింపులు కల్పించేలా కేంద్రాన్ని ఒప్పించాలని స్టాలిన్ ను అర్థించాడు. దీనిపై స్టాలిన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..