Friday, November 22, 2024

పురాతన విగ్రహాల అమ్మకం.. రెడ్​హ్యాండెడ్​గా దొరికిన బీజేపీ నేత

తమిళనాడులో పురాతన విగ్రహాలను అమ్ముతుండగా బీజేపీ నేతతో సహా మరో ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. ఏడు హిందూ దేవాతామూర్తుల విగ్రహాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రత్యేక అధికారి నేతృత్వంలో జరిపిన దాడిలో పోలీసులే ఇన్​వాల్వ్​ కావడం విస్తుగొలుపుతోంది..

తమిళనాడు రాష్ట్రంలోని మనాథపురంలో రూ.5 కోట్ల విలువైన పురాతన విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించిన తమిళనాడు బీజేపీ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శితో పాటు మరో ఇద్దరు పోలీసులను ఇవ్వాల అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి మొత్తం ఏడు హిందూ దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్​ దినకరన్ నేతృత్వంలోని మదురై పోలీసు అధికారులు ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ఎంతో నేర్పరితనం కనబరిచారు. కాగా,  బీజేపీ నేత అలెగ్జాండర్ విగ్రహాలను విక్రయించే ప్రయత్నంలో ఉన్నారనే పక్కా సమాచారం మేరకు దాడి చేసి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నామని పోలీస్​ ఆఫీసర్​ చెప్పారు.  4 సంవత్సరాల క్రితం ఇద్దరు పోలీసులు తనకు ఇచ్చిన ఏడు హిందూ పురాతన విగ్రహాలు తనవద్ద ఉన్నాయని  అలెగ్జాండర్ ఒప్పుకున్నాడు.

బీజేపీ లీడర్​ అలెగ్జాండర్ నుంచి కాళీ మాతా విగ్రహం, మురుగన్ విగ్రహం, వినాయక విగ్రహం, రెండు నటరాజ విగ్రహాలు, రెండు నాగ కన్ని విగ్రహాలను స్పెషల్​ పార్టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయం వెనుక ఉన్న కాలువ నుంచి విగ్రహాలను వెలికి తీశారు. అరుప్పుకోట్టైకి చెందిన ఇళంకుమారన్, దిండిగల్‌కు చెందిన నాగేంద్రన్  అనే పోలీసు అధికారులతో పాటు మరో ఇద్దరు కలిసి నాలుగేళ్ల క్రితం సేలంలోని ఎడప్పాడి వద్ద ఓ ముఠా నుంచి విగ్రహాలను  కొనుగోలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఆ పురాతన విగ్రహాలను రూ.5 కోట్లకు విక్రయించేందుకు అలెగ్జాండర్‌ను వారు సంప్రదించారు. కాగా, దీనికి సంబంధించిన విచారణ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement