Friday, November 22, 2024

ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత!

ప్ర‌ముఖ తమిళ ద‌ర్శ‌కుడు కె వి ఆనంద్‌ గుండెపోటుతో  శుక్రవారం క‌న్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ జీవాతో రంగం, సూర్యతో బ్రదర్స్, వీడొక్కడే, లేటెస్ట్‌గా బందోబస్త్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు సూపర్ హిట్ చిత్రాలు ప్రేమ‌దేశం, ఒకే ఒక్క‌డు, ర‌జినీకాంత్ శివాజీ, బాయ్స్ వంటి చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా కూడా ప‌నిచేశారు. మొదట్లో ఫోటో జర్నలిస్ట్‌ గా పనిచేసిన కె వి ఆనంద్ ఆ తర్వాత తమిళ సినిమా క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఆపై సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, డైరెక్టర్ గా మారారు. ఆపై జీవా హీరోగా కో (తెలుగులో రంగం)తో ఆయన సత్తా ప్రేక్షకులకు తెలిసింది.

ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా పెద్దగా అలరించకపోయినా.. ఆ తర్వాత ఆయన సూర్య‌తో వీడొక్క‌డే సినిమా తీసి హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత ఆయన జీవాతో రంగం అనే పొలిటికల్ థ్రిల్లర్‌ సినిమా చేశారు. ఈ సినిమా అటు తమిళంతో పాటు తెలుగు కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ త‌ర్వాత మరోసారి సూర్యతో ప్రయోగాత్మక చిత్రం బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌) అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సూర్య డబుల్ యాక్షన్ చేశారు. కె వి ఆనంద్ అకాల మృతిపై తమిళ చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement