భారీ బడ్జెట్, భారీ సెట్స్ ఇవన్నీ వినగానే గుర్తొచ్చే పేరు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. భారీ తారాగణంతో సినిమాని తీయాలంటే ఈయన తర్వాతే ఎవరయినా. ఒకటో, రెండో మినహాయించి ఆయన తెరకెక్కించిన మిగతా చిత్రాలన్నీ హిట్ట్ లే. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు శంకర్. ఆయన చేసిన సినిమాలు కమల్ .. రజనీ .. అర్జున్ .. విక్రమ్ .. ప్రశాంత్ వంటి హీరోల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచిపోయాయి. అలాంటి శంకర్ ఇప్పుడు తన తనయుడు ‘అర్జిత్’ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించనున్నారట.శంకర్ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని చాలా కాలమే అయింది. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను ఇతర దర్శకులతో కలిసి చేస్తూ వెళుతున్నారు.
ఈ బ్యానర్ లోనే తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని అంటున్నారు. అందుకోసం ఆయన ‘కాదల్’ సీక్వెల్ ను ఎంచుకోవడం విశేషం. తమిళనాట 2004లో వచ్చిన ‘కాదల్’ అక్కడ చరిత్ర సృష్టించింది. భరత్ – సంధ్య జంటగా నటించిన ఈ సినిమాకి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమా ‘ప్రేమిస్తే’ పేరుతో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా సీక్వెల్ తోనే ‘అర్జిత్’ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఆల్రెడీ శంకర్ కూతురు ‘అదితి’ కూడా హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..