– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తమిళ నటుడు అజిత్ కుమార్ బైక్, కార్ రేసింగ్‌లపై మక్కువ చూపుతాడు. వాటిని నడపడంలో తను ఎంతో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. ఇక.. తన సొంత మోటార్ సైకిల్ టూరింగ్ కంపెనీ ‘ఎకె మోటో రైడ్’ని ప్రారంభించనున్నట్లు ఇవ్వాల ప్రకటించాడు. మోటార్‌సైకిల్ టూరింగ్ కంపెనీ AK మోటో రైడ్ ద్వారా తాను మోటార్‌సైకిల్స్, అవుట్డోర్ రేసింగ్‌పై నాకున్న అభిరుచిని వృత్తిపరమైన ప్రయత్నంగా మారుస్తానని తెలిపాడు. దీన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నాడు అజిత్ కుమార్.
కాగా, AK మోటో రైడ్ ఆసక్తిగల రైడర్లు, అడ్వెంచర్ ఔత్సాహికులు.. వాండర్లస్ట్ సీకర్స్ టూర్లను అందించనుంది. ఇది భారతదేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని మాత్రమే కాకుండా ఇతర దేశలలో అంతర్జాతీయ రహదారులను కూడా అన్వేషిస్తుంది. అదనంగా, ఈ కొత్త వెంచర్ మోటార్ సైకిల్ టూర్లలోని ఎదురయ్యే ఇబ్బందులను నుంచి ఈజీగా బయటపడేందుకు బాగా తెలిసిన ప్రొఫెషనల్ లోకల్ గైడ్లతో అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సూపర్‌బైక్‌లను అందించనున్నది.