Saturday, November 23, 2024

వ్యాపార‌స్తుల ర‌క్ష‌ణ‌కి ఆయుధాలు.. తాలిబ‌న్ల సంచ‌ల‌న నిర్ణ‌యం..

ఏ రోజు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో తాలిబ‌న్ల‌కే అర్థం కావ‌డం లేదు. ఆఫ్ఘ‌నిస్థాన్ లో త‌మ ప్ర‌భుత్వాన్ని నెల‌కొలిపిన తాలిబ‌న్లు మ‌హిళ‌ల‌పై ప‌లు ఆంక్ష‌లు విధిస్తూ..ప‌లు ఆంక్ష‌లు సృష్టిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న తాలిబ‌న్లు మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. వ్యాపార‌స్తులు వారి ర‌క్ష‌ణ కోసం ఆయుధాల‌ను వారి వెంట తీసుకెళ్ళ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ మేర‌కు ఆ దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వ్యాపార‌స్తులు, పెట్టుబ‌డి దారుల భ‌ద్ర‌త‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఆ శాఖ అధికార ప్ర‌తినిధి స‌యీద్ ఖోస్టాయ్ వెల్ల‌డించారు. అంతేకాదు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాము ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వివ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement