Wednesday, November 20, 2024

ఆగస్టు 31 డెడ్‌లైన్‌.. అమెరికాకు తాలిబన్ల వార్నింగ్

అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్​లు అగ్రరాజ్యం అమెరికాకు డెడ్ లైన్ విధించారు. అఫ్గన్ లో ఉన్న తమ దేశ ప్రజలను తరలించే ప్రక్రియను అమెరికా దృష్టి పెట్టింది. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణకు గడువు ఆగస్టు 31 దగ్గర పడుతోంది. పొడిగింపు అంశంపై సైన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

అయితే, ఈ ప్రకటనపై తాలిబన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అఫ్గన్ గడ్డపై నుంచి అమెరికన్‌ సేనల ఉపసంహరణకు ఆగస్టు 31 డెడ్‌ లైన్‌ అని తేల్చిచెప్పారు. ఆ సమయం దాటిన తర్వాత అమెరికా, నాటో దళాలు తమ గడ్డపై ఉంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాలిబన్ల వశమైన అఫ్గనిస్థాన్‌లో ప్రస్తుతం కాబూల్‌ విమానాశ్రయం మాత్రమే విదేశీ సైన్యాల ఆధీనంలో ఉంది. అమెరికా సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు అక్కడ నుంచే పనిచేస్తున్నాయి. కాగా, అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ చిక్కుకున్న విదేశీయుల తరలింపు క్లిష్టంగా మారింది.

ఈ వార్త కూడా చదవండి: బీసీ కమిషన్ కొత్త చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నియామకం..

Advertisement

తాజా వార్తలు

Advertisement