తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ ముగిసింది. ఈ మేరకు అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ ధ్రువీకరించింది. అధ్యక్షుడు జోబైడెన్ విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు ఫ్గాన్ ను వీడాయి. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా చిట్టచివరి విమానం సీ-17 వెళ్లిపోయింది. అఫ్గానిస్థాన్ నుంచి చివరి విమానంలో అమెరికా కమాండర్, రాయబారి వెళ్లారు. అఫ్గాన్ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. దీంతో అఫ్గాన్‌కు పూర్తి స్వాతంత్య్రం వచ్చిందని తాలిబన్లు ప్రకటించారు. తుపాకులతో గాలిలో కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
కాగా, అఫ్గాన్ నుంచి ఆగస్ట్ 31లోపు తమ బలగాలను ఉపసంహరించుకుంటామని గతంలోనే అమెరికా ప్రకటించింది. ఆగస్ట్ 15న ఆ దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ అమెరికా మొత్తం లక్షా 22 వేల మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించింది. చివరి అమెరికా విమానం కాబూల్ నుంచి పైకి లేవగానే.. తాలిబన్లు ఆనందంతో గాల్లోకి కాల్పులు జరిపారు. అఫ్గానిస్థాన్ కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: కోవిడ్ పై అలసత్వం వద్దు.. విద్యార్థులు పట్ల జాగ్రత్తలు తీసుకోండి