సన్నీలియోన్ డ్యాన్స్ వీడియో ‘‘మధుబన్ మే రాధిక నాచే’’పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఫైర్ అయ్యారు. శృంగార తార సన్నీలియోన్ “అశ్లీల” నృత్యం వీడియోను తొలగించాలని సన్నీ లియోన్ తో పాటు సంగీత స్వరకర్త సాకిబ్ తోషికి 72 గంటల టైమిస్తున్నట్టు చెప్పారు. “కొందరు నిరంతరం హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటారు. రాధ (కృష్ణుడి భార్య) పేరిట ఇక్కడ దేవాలయాలున్నాయి.. మేము ఆమెను ఎంతో ఆరాదిస్తాం.. మరి సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలు చేయవచ్చు కదా.. కానీ, ఇట్లాంటి వెకిలి పాటలు, వీడియోలు మమ్మల్ని ఎంతో బాధకు గురిచేస్తున్నాయి. దీనిపై న్యాయ సలహా మేరకు చర్య తీసుకుంటా. మూడు రోజుల్లో వీడియో తొలగించకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది’’ అని హోం మంత్రి నరోత్తమ్ అన్నారు.
కాగా, సన్నీ లియోన్ వీడియోపై చర్య తీసుకోవాలని మధ్యప్రదేశ్ మంత్రి మాత్రమే కాకుండా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిందూ పూజారులు కూడా మాట్లాడారు. "ప్రభుత్వం సన్నీలియోన్ పై చర్య తీసుకోకపోతే, ఆమె వీడియో ఆల్బమ్‌ను నిషేధించకపోతే కోర్టుకు వెళ్తాం" అని ఉత్తరప్రదేశ్ లోని బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు.