రాజస్థాన్ కి చెందిన బిజెపి ఎంపీ దివ్యకుమారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్ రాజవంశానికి చెందిన మూడోతరం మహిళ ఈ దివ్యకుమారీ. ప్రస్తుత తాజ్ మహల్ ఉన్న స్థలంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని.. తాజ్ మహల్ లోపల ఇప్పటికీ శివలింగం ఉందని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు తాజ్ మహల్ లోని గదుల్లో దేవతా విగ్రహాలు.. శాసనాలు దాచబడ్డాయని.. లోపల ఉన్న 22 గదులను తెరవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది. ఈ వివాదం నడుస్తున్న వేళ అసలు తాజ్ మహల్ ఉన్న స్థలం మొత్తం జైపూర్ రాజవంశీయులదేనని.. గతంలో అక్కడ ఉన్న తమ పూర్వీకుల భవనాలను కూల్చివేసి ఆ స్థలాన్ని ఆక్రమించిన షాజహాన్ అక్కడ తాజ్ మహల్ నిర్మించినట్లు రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దివ్యకుమారీ కొత్త వివాదానికి తెరతీశారు. తాజ్ మహల్ నిర్మించిన స్థలంలోనే గతంలో తమ పూర్వీకులకు ప్యాలెస్ ఉండేదని.. ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని నిరూపించే పత్రాలు సైతం తన వద్ద ఉన్నాయని ఎంపీ దివ్యకుమారీ పేర్కొంది. షాజహాన్ అధికారంలో ఉన్న సమయంలో అతడు ఆ భవనాన్ని బలవంతంగా లాక్కుని భవనాన్ని కూల్చివేసి తాజ్ మహల్ కట్టినట్లు దివ్యకుమారీవెల్లడించారు. అయితే తాజ్ మహల్ ను కూల్చివేయమని తాము చెప్పడం లేదని.. నిజనిజాలు తెలియాలంటే విచారణ జరగాలని ఆమె అన్నారు. ఇటీవల పలు సంఘాల నుంచి వచ్చిన ఆరోపణల ధృవీకరించడానికి విచారణ నిర్వహిస్తేనే అన్ని వాస్తవాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయని ఎంపీ దివ్యకుమారీ తెలిపారు. నేడు ప్రభుత్వం భూసేకరణ చేపడితే పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అప్పట్లో అలాంటి చట్టం లేదని.. అయితే ఈ భూమి జైపూర్ రాజకుటుంబానికి చెందినదని స్పష్టమవుతోంది. ఆ భూమి మాదేనని నిరూపించే పత్రాలు మా వద్ద ఉన్నాయన్నారు. కోర్టు అడిగితే ఆ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement