Tuesday, November 26, 2024

ఫీజుల ఖరారుపై ఇంజనీరింగ్‌ కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ విచారణ.. రేపు హాజరు కానున్న 29 కాలేజీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుపై ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ విచారణ (హియరింగ్‌) చేపడుతోంది. ఇందులో భాగంగానే సోమవారం 15 కాలేజీలతో సంప్రదింపులు జరిపింది. ఈరోజు (మంగళవారం) మరికొన్ని కాలేజీలతో అధికారులు సంప్రదింపులు జరపనున్నారు. దాదాపు 29 కాలేజీలు నేడు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులతో సమావేశమై ఇంజనీరింగ్‌ ఫీజులపై తమ అభిప్రాయాలను తెలుపనున్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకొని టీఏఎఫ్‌ఆర్‌సీ ఇంజనీరింగ్‌ ఫీజులను కాలేజీల వారీగా నిర్ధారిస్తోంది.

కాలేజీని బట్టి ఈ ఫీజులు ఉంటాయి. ప్రతి మూడేళ్లకు ఒక సారి ఇంజనీరింగ్‌ ఫీజులను టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేస్తోంది. అయితే 2019 బ్లాక్‌ పిరియడ్‌కు సంబంధించిన ఇంజనీరింగ్‌ ఫీజుల గడువు 2022-23 విద్యా సంవత్సరానికి ముగియడంతో 2022-25 బ్లాక్‌ పిరియడ్‌కు సంబంధించిన కొత్త ఫీజుల ఖరారు కోసం గత కొన్ని నెలలుగా టీఏఎఫ్‌ఆర్‌సీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే జులై నెలలో ఇంజనీరింగ్‌ కాలేజీలను పిలిచి కాలేజీలతో సంప్రదింపులు చేపట్టి ఫీజులను ఖరారు చేసింది.

అయితే ఈ ఫీజులు అమల్లోకి రాకపోవడంతో కొన్ని కాలేజీలు హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నాయి. గత బ్లాక్‌ పిరియడ్‌ కంటే ఈ సారి కొన్ని కాలేజీల ఫీజులు భారీగా పెరగడంమతో టీఏఎఫ్‌ఆర్‌సీ మళ్లిd విచారణను చేపట్టింది. ఇందులో భాగంగానే అడిట్‌ రిపోర్టుల ఆధారంగా మరోసారి ఫీజులను ఖారు చేసేపనిలో నిమగ్నమైనట్లు టీఏఎఫ్‌ఆర్‌సీలోని ఓ అధికారి తెలిపారు. రేపు మరికొన్ని కాలేజీలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement