దుబాయ్: టీ20 ప్రపంచ కప్ సమరానికి నేడు తెరలేవ నుంది. ఆదివారం డబుల్ హెడర్‌తో మెగాటోర్నీ ఆరంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఒమన్ జట్టు పపువా న్యూ గినియాతో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30కు తలప డనుంది. మరో మ్యాచ్‌లో రాత్రి 7.30కు బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్‌తో తలప డనుంది. అగ్రశ్రేణి జట్లుతో మొదలయ్యే సూపర్-12 స్టేజ్ అక్టోబర్ 23నుంచి మొదలవనుంది. టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నా మ్యాచ్‌లు కొవిడ్ కారణంగా యూఏఈ, ఒమన్‌లో నిర్వహించ నున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. 18న ఇంగ్లండ్‌తో, 20న ఆస్ట్రేలియాతో కోహ్లీసేన వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.
టాప్-8జట్లు నేరుగా సూపర్-12కు అర్హత
ఐపీఎల్ 2021 ముగిసిన రెండురోజులకే టీ20 ప్రపంచకప్ యూఏఈ, ఒమన్ వేదికలుగా ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్ తొలిరౌండులో టాప్- 8జట్లు పోటీపడవు. ఈ జట్లు నేరుగా సూపర్-12 స్టేజ్‌లో బరిలోకి దిగుతాయి. టాప్-8లో లేని బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాం డ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యూ గినియా మధ్య తొలిరౌండ్లులో అర్హతపోరు జరగనుంది. వీటిలో నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. తొలి దశ మ్యాచ్‌లను యూఏఈ తోపాటు ఒమన్‌లో నిర్వహించనున్నారు. ఐపీఎల్ జరిగిన దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాలను సూపర్-12 దశ నుంచి జరిగే మ్యాచ్‌లకు వినియోగించనున్నారు. మొత్తం 12జట్లు రెండు గ్రూప్‌లుగా రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. అక్టోబర్ 23నుంచి సూపర్-12 దశ ఆరంభం కానుంది.సూపర్-12 దశలో 30మ్యాచ్‌లు జరగనున్నాయి. 12 జట్లలో 4జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. నవంబర్ 14న ఫైనల్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 70శాతం ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ఐసీసీ ప్రకటించిం ది. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ధోనీ మెంటార్ గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్ విజేతకు రూ.12కోట్లు, రన్నరప్‌కు రూ.6కోట్లు, సెమీఫైనల్స్‌కు చేరి ఓడిన రెండుజట్లకు చెరో రూ.3కోట్లు, సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగిన 8జట్లకు రూ.52.50లక్షలు అందజేయనున్నారు. సూపర్-12 దశలో ప్రతి మ్యాచ్ లో విజేతకు రూ.30లక్షల బోనస్‌గా ఇవ్వనున్నారు.
తొలిసారి డీఆర్‌ఎస్ విధానం
తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో అంపైర్ నిర్ణయంపై రివ్యూ విధానం (డీఆర్‌ఎస్) ప్రవేశపెట్టనున్నారు. ప్రతిజట్టు ఇన్నింగ్స్‌లో రెండుసార్లు రివ్యూను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పురుషుల టీ20ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి..ఇంతకుముందు 2018లో వెస్టిండీస్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి డీఆర్‌ఎస్ విధానాన్ని వినియోగించారు. అనంతరం 2020లో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ ఈ విధానాన్ని ఉపయోగించారు. 2019 ప్రపంచకప్‌లో చివరిసారి తలపడిన చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మరోసారి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 24న ఈ టెన్షన్ ప్యాక్ మ్యాచ్ జరగనుంది. భారత్-పాక్ మ్యాచ్‌తోనే సూపర్-12దశ మొదలవనుంది. కొవిడ్ నేపథ్యంలో పటిష్ఠ బయోబబుల్‌లో నాలుగు వేదికల్లో 16జట్ల పోరాటానికి రంగం సిద్ధమైంది. బయోబబుల్‌లో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వారిని 10రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. బయోబబుల్ నిబంధ నలును కఠినంగా అమలుచేయనున్నారు. మరోవైపు పరిమిత సంఖ్యలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను కూడావారితో కలిసి ఉండేందుకు అనుమతించను న్నారు. ప్రేక్షకులు ఖచ్చితంగా మాస్క్‌ను ధరించాలని బబుల్ ఇన్‌చార్జ్ అలెక్స్ మార్షల్ తెలిపాడు.
గ్రూప్-2లో భారత్-పాక్
గ్రూప్-ఎలో శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియా ఉండగా గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఒమన్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా జట్లు అర్హతకోసం పోరాడతాయి. వీటిలో మొదటి నాలుగు స్థానంలో నిలిచిన జట్లు సూపర్-12దశకు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 23నుంచి సూపర్-12 దశ మొదలవనుంది. ఇక భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఎn్గానిస్థాన్, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు సూపర్-12 దశనుంచి బరిలోకి దిగనున్నాయి. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లతోపాటు గ్రూప్-ఎలో తొలిస్థానం సాధించిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఈ గ్రూప్‌లో చేరతాయి. అదేవి ధంగా గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఎn్గానిస్థాన్ జట్లు ఉండగా వీటితో గ్రూప్-బిలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్-ఎలో రెండొ స్థానంలో నిలిచిన జట్టు చేరతాయి. ఇక సూపర్12 దశలో నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 10, రెండో సెమీఫైనల్ నవంబర్ 11న, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరగనుంది.
ఇది కూడా చదవండి.. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్