ప్రభ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ యువకుడికి ఒమన్ దేశంలో మంచి చాన్స్ వచ్చింది. ఆదివారం నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుండగా.. ఫస్ట్ మ్యాచ్ ఒమన్.. పపువా న్యూ గినియాతో జరుగుతోంది. అయితే.. ఒమన్ టీమ్ లో మన హైదరాబాద్ కుర్రాడు సెలక్ట్ అయ్యాడు. కవాడిగూడకు చెందిన శ్రీమంతుల సందీప్ గౌడ్ ఒమన్ టీమ్ లో ఆడుతున్నట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 29 ఏళ్ల సందీప్.. 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 టీమ్స్ లో ఆడాడు. 2016లో జాబ్ కోసం ఒమన్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. అనుకోకుండా ఒమన్ దేశవాళీ మ్యాచుల్లో ఆడే చాన్స్ రావడంతో సందీప్ సత్తా చాటి, నేషనల్ టీమ్ కు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement